The Congress party is constantly working to build a nation of international, socialist, secular, democratic and international democratic India. From Nehru to Manmohan to the democratic origins of the secular values .. Every person who served as the Congress Prime Minister was accompanied.
Nehru imparted technology education to the five-year programs, VISAs, IITs and IIMs, Lal Bahadur Shastri with the Jai Jawan and Jai Kisan mantra showed a new direction for India. Indira Gandhi waged war on poverty with the slogan of Garibi Hathao. The secular system has been enshrined in the constitution with a large plate of secular values. Indiramma has set a new history with the bank’s nationalization and the abolition of royalty. Rajiv Gandhi has put India on a new trajectory by pushing the country to Information Technology. PV Narasimha Rao, the Prime Minister of the most toxic economic strata, has run the country with a streamlined economic system. With the Look East Policy, the country has provided a new sustainable trading system. Manmohan Singh, who served as Congress Prime Minister for a long period of time as Prime Minister of the country. With the United States of America .. India’s role in strengthening Indian relations is indispensable. The first Home Minister to unite the country was Sardar Vallabhbhai Patel, Maulana Abul Kalam Azad in strengthening the education sector, Baba Saheb Ambedkar as the leader of the Constitution and the Constitution of the Indian judiciary. The thoughts of all .. Srimati Sonia Gandhi and Rahul Gandhi are leading the Congress party to make way for Bhavishyat India. Indira TV is coming forward to give you the views of the Congress elders. Let us take the ideology of the Congress party.
Let’s work together. Let’s get Congress to power…
Telugu Translation
సర్వసత్తాక , సామ్యవాద , లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర భారతాన్ని నిర్మించేందుకు.. దానిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. ప్రజాస్వామ్య మూలాలను, లౌకిక విలువలను పరిరక్షించేందుకు నెహ్రూనుంచి మన్మోహన్ దాకా.. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానులుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరు పాటుపడ్డారు. పంచవర్ష ప్రణాళికలు, వ్యవసాయం, ఐఐటీ, ఐఐఎంలతో సాంకేతిక విద్యను నెహ్రూ దేశానికి పరిచయం చేస్తే, జై జవాన్, జై కిసాన్ మంత్రంతో లాల్ బహుదూర్ శాస్త్రి భారత్ కు సరికొత్త దిశను చూపించారు. గరీబి హఠావో నినాదంతో పేదరికంపై ఇందిరాగాంధీ యుద్ధమే చేశారు. లౌకిక విలువలపు పెద్ద పీట వేస్తూ లౌకిక వ్యవస్థను రాజ్యాంగంలో పొందుపరిచారు. బ్యాంకులు జాతీయీకరణ, రాజాభరణాల రద్దు వంటివాటితో సరికొత్త చరిత్రను ఇందిరమ్మ నెలకొల్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనీ దేశానికి పరిచయం చేస్తూ రాజీవ్ గాంధీ భారతదేశాన్ని సరికొత్త పథంవైపు పరుగులు తీయించారు. అత్యంత విషమకర ఆర్థిక పరిస్థితుల్లో ప్రధానిగా పగ్గాలు అందుకున్న పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని పరుగులు తీయించారు. లుక్ ఈస్ట్ పాలసీతో సరికొత్త సుస్థిర వాణిజ్య వ్యవస్థను దేశానికి అందించారు. దేశం గాడితప్పుతున్న కాలంలో కాంగ్రెస్ ప్రధానిగా దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మన్మోహన్ సింగ్.. అణు విద్యుత్, ఆర్థిక బలోపేతం, బ్యాంకులు స్థిరీకరణ, మెట్రోల ఏర్పాటు, జాతీయ రహదారుల విస్తరణ, అణ్వస్త్ర దేశంగా భారత్ ను మార్చడంలో మన్మోహన్ ఘనవిజయం సాధించారు. అగ్రరాజ్యం అమెరికాతో.. భారత్ సంబంధాలు మరింత పటిష్టం చేయడంలో ఆయన పాత్ర అనితర సాధ్యం. ఇక దేశాన్ని ఏకం చేయడంలో మొదటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభబాయ్ పటేల్, విద్యాశాఖను పటిష్టం చేయడంలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, రాజ్యాంగాన్ని అందించడంతో పాటు భారత న్యాయవ్యవస్థను పరిపుష్టం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో కాంగ్రెస్ పార్టీని ఆసరగా చేసుకుని నవభారతాన్ని నిర్మించారు. వారందరి ఆలోచనలు.. భవిష్యత్ భారతానికి బాటలు చేసేలా శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలను మీకు అందించేందుకు ఇందిరా టీవీ మీ ముందుకు వస్తోంది. ఆదరించిండి.. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అందిరి వద్దకు తీసుకువెళదాం. కలిసికట్టుగా పనిచేద్దాం. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువద్దాం.